అల్లుడి కుటుంబంపై మామ దాడి..అత్త మృతి

అల్లుడి కుటుంబంపై మామ దాడి..అత్త మృతి

నల్గొండ జిల్లా నిడమనూర్ మం, బొక్కమంతల పహాడ్ గ్రామంలో దారుణం జరిగింది. కుతుర్ని వేధిస్తున్నారంటూ అల్లుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు సూరయ్య అనే వ్యక్తి. అత్తింటి వారు తన కూతుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కత్తులతో దాడి చేశారు. దీంతో కూతురి అత్త అచ్చమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. అల్లుడితో పాటు అతని తండ్రి, అమ్మమ్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.

 

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు