
కోరియోగ్రాఫర్ బృందా.. ఈపేరు సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. ఎన్నో హిట్ మూవీస్ కి కోరియోగ్రాఫి అందించారు. కోరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన బృంద .. డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమానే డిజాస్టార్ అయ్యింది. ఆ తర్వాత ‘కోనసీమ థగ్స్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ యాక్షన్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా..? లేదా ఇప్పుడు చూద్దాం.
సినిమా కథ..
శేషు (హృదు హరూన్ ) ఒక అనాథ. ఓ అమ్మాయిని ప్రేమించిన శేషు అమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని హాయిగా గడుపుదామనుకుంటున్న సమయంలో ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. కాకినాడ జైలులో శేషుకు పరిచయం అయిన కొంతమంది ఖైదీలతో జైలు నుంచి పారిపోవాలని ప్లాన్ వేస్తాడు. జైలులో ఉండగానే అక్కడి లోకల్ లీడర్ శేషుని బెదిరిస్తుంటాడు..? అయితే.. అతను శేషును ఎందుకు బెదిరిస్తాడు..? అసలు శేషు ఎవరిని..? ఎందుకు చంపాడు..? హత్యకేసులో జైలులో ఉన్న శేషు...ఎందుకు పారిపోవాలనుకుంటాడు..? జైలు నుంచి పారిపోయాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.
సినిమా మొదట్లో జైలులో వచ్చే ఫైట్ సీన్ మేకింగ్ చాలా బాగుంది. అయితే ఫస్టాఫ్ మిడ్ వరకు సినిమా స్టోరీ చాలా స్లోగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉంది అంటే ఇదే. కానీ, బాబీ సింహా ఎంటరయ్యాక... సినిమా మరో రేంజ్ కు వెళ్తుంది. 90శాతం సినిమా జైలులోనే ఉన్నా అసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్ లోనూ స్క్రీన్ ప్లే, లాస్ట్ లో వచ్చే ఫైట్ ఈ సినిమాకి మరో హైలెట్ అని చెప్పాలె.
జీవించేశారు
ఇక ఈ సినిమాకి కథ ఎంత బలమో.. ఆ కథని నడిపించిన తీరు, శామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడాఅంతే బలం. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. ఇక శేషు క్యారెక్టర్ లో హృదు హరూన్, దొర క్యారెక్టర్ లో బాబీ సింహా జీవించేశారు. ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, ఫైట్స్ తో పాటు డ్యాన్స్ తోనూ అదరగొట్టారు. ఇన్ స్పెక్టర్ గా ఆర్కే సురేష్, తోటి ఖైదీ మధుగా మునిష్ కాంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా... మూగ అమ్మాయిగా అనస్వర రాజన్ చాలా చక్కగా నటించింది. తనఅందంతో ఆకట్టుకుంది. ఇక సినిమా ఎండింగ్ లో వచ్చే ట్రెడిషనల్ సాంగ్ లో హృదు హరూన్, బాబీ సింహా డ్యాన్స్ లు అదిరిపోయాయి.
ఆకట్టుకున్న సంగీతం
సాంగ్ కోరియోగ్రాఫీ, మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఇక యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సినిమా మొత్తం జైలులోనే ఉండటం, కాస్త స్లో నరేషన్ వల్ల స్టార్టింగ్ లోనే కొంచెం ఇబ్బందిగా అనిపించినా... శామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని కుర్చీ నుంచి కదలనివ్వదు. థియేటర్ లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది.
బ్యానర్ : హెచ్.ఆర్. పిక్చర్స్, జియో స్టూడియోస్
నటినటులు : హృదు హరూన్, బాబీ సింహా, అనస్వర రాజన్, మునీష్ కాంత్, శరత్ అప్పాని, పీఎల్ తెనప్పన్
డైరెక్టర్ : బృందా
నిర్మాత : రియా శిబు, ముమ్తాస్ ఎమ్
సంగీతం : శామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుసామి
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని
కోరియోగ్రాఫర్ : బృందా