
వరంగల్ అర్బన్ జిల్లా: ఏం కష్టమొచ్చిందో గాని.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన నవ వధువు కారట్లపల్లి అర్చన ఉరి వేసుకుని మృతి చెందింది. అర్చన మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఉరి ఇంట్లో షెల్ఫ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతుండగా.. భర్త వంశీ కృష్ణనే ఉరి వేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుండే వరకట్నం కోసం భర్త వేధించేవాడని మృతురాలి అక్క ఆరోపిస్తోంది. బంధువుల పరస్పర వాదనలు.. ఫిర్యాదులు ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వాస్తవాలను వెలికి తీసేందుకు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు వంగర పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు వేగిరం చేస్తామని.. ఫోన్ కాల్స్.. ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించి.. సాంకేతికంగా విశ్లేషించి కేసు విచారణ చేస్తామన్నారు.
For more news…
అడ్వకేట్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శీను అరెస్ట్
ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?
పేపర్ బాటిల్స్‌లో కూల్‌డ్రింక్స్
నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్