పోలీసులను చూసి బైకు వదిలి పరారైన యజమాని

V6 Velugu Posted on Dec 07, 2021

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ఆ జరిమానాలను కట్టకుండా తప్పించుకు తిరుగుతుంటారు. అలా ఫైన్లు చెల్లించకుండా తిరుగుతున్న ఓ వాహనదారుడు పోలీసులకు చిక్కాడు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన AP 23 M 9895 నెంబర్ గల హీరో హోండా ప్యాషన్ బైకును పోలీసులు ఆపారు. దాంతో వాహన యజమాని బైకును ఆపి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఏమీ అర్థం కానీ పోలీసులు..  బైకుకు చలానా విధించారు. చలానా లిస్ట్ చూస్తే ఆ బైకు మీద అప్పటికే 179 చలానాలు ఉన్నాయి. వాటి మొత్తం అక్షరాల రూ. 42,475. ఈ జరిమానాలను చెల్లించకుండా వాహన యజమాని తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం పోలీసులకు చిక్కడంతో.. బైకును సీజ్ చేశారు. 

Tagged Hyderabad, POLICE, Traffic Rules, kachiguda, bike seize, traffic fines

Latest Videos

Subscribe Now

More News