బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా రిలీజ్.. విజయశాంతికి దక్కని చోటు

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా రిలీజ్.. విజయశాంతికి దక్కని చోటు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అగ్ర నాయకులు ప్రచారానికి రానున్నారు.

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో విజయశాంతికి మాత్రం చోటు దక్కలేదు. ఇదే అంశంపై ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ వంటి నేతలకు అవకాశం దక్కింది. 

నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ప్రధాని బీసీ గర్జన సభకు తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే..

  • నరేంద్ర మోదీ
  • జేపీ నడ్డా
  • రాజ్‌నాథ్‌ సింగ్‌
  • అమిత్‌షా
  • నితిన్‌ గడ్కరీ
  • యడియూరప్ప
  • కె.లక్ష్మణ్‌
  • యోగి ఆదిత్యనాథ్‌
  • పీయూష్ గోయల్‌
  • నిర్మలా సీతారామన్‌
  • స్మృతి ఇరానీ
  • పురుషోత్తం రూపాలా
  • అర్జున్‌ ముండా
  • భూపేంద్రయాదవ్‌
  • కిషన్‌రెడ్డి
  • సాధ్వి నిరంజన్‌ జ్యోతి
  • ఎల్‌.మురుగన్‌
  • ప్రకాశ్‌ జావడేకర్‌
  • తరుణ్‌ ఛుగ్‌
  • సునీల్ బన్సల్‌
  • బండి సంజయ్‌
  • అరవింద్‌ మేనన్‌
  • డీకే అరుణ
  • పి.మురళీధర్‌రావు
  • దగ్గుబాటి పురందేశ్వరి
  • రవికిషన్‌
  • పొంగులేటి సుధాకర్‌రెడ్డి
  • జితేందర్‌రెడ్డి
  • గరికపాటి మోహన్‌రావు
  • ఈటల రాజేందర్‌
  • ధర్మపురి అర్వింద్‌
  • సోయం బాపూరావు
  • రాజాసింగ్‌
  • కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • బూర నర్సయ్యగౌడ్‌
  • గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
  • దుగ్యాల ప్రదీప్‌కుమార్‌
  • బంగారు శ్రుతి
  • కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌
  • టి.కృష్ణ ప్రసాద్‌