
మొయినాబాద్ ఫాంహజ్ కేసులో నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ప్రొసిజర్ ప్రకారం అరెస్ట్ జరగలేదని ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ రిజెక్ట్ చేసింది. దీంతో పోలీసులు ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇవ్వనున్నారు. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరనున్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది.
లంచం ఇవ్వజూపినట్లుగా ఎలాంటి నగదు లభ్యం కాకపోవడంతో పీసీ యాక్ట్ కేసుల కింద పరిగణనలోకి తీసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలోనూ 41సీఆర్పీసీ నిబంధనలు పాటించలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.