క్లోజ్ చేసిన మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

క్లోజ్ చేసిన మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

సుమారు 18 ఏండ్ల కింది సంఘటన.. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా రాజేంద్రనగర్ పోలీసులు ఓ కేసును క్లోజ్ చేశారు. కానీ అనూహ్యం గా ఇన్నేండ్లకు సదరు కేసు నిందితులు పోలీసులకుచిక్కారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీచైతన్య కుమార్ తో కలిసి సీపీ అంజనీకుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. మసుదాబీ(70) చాంద్రాయణ గుట్ట హస్మాబాద్ లో నివాసం ఉండేది. ఆమెకు ఐదుగురు కూతుళ్లు,ముగ్గు రు కుమారులు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత తన రెండో కుమారుడు మహ్మద్ఖాజా(30) తప్ప మిగిలిన అందరి పెళ్లిళ్లు చేసింది.తల్లి సంపాదన పైనే ఆధారపడ్డ ఖాజా మద్యం ,పేకాటకు బానిసయ్యాడు. ఇంటినే పేకాట క్లబ్ గా  మార్చేశాడు. ఇంట్లో వాళ్లతో పాటు పరిసరప్రాంతాల వారిని ఇబ్బందులకు గురి చేసేవాడు.ఖాజా ప్రవర్తనతో తల్లితో పాటు కుటుంబసభ్యులు అంతా విసిగిపోయారు. దీంతో ఖాజాను హతమార్చాలనుకున్నా రు. అందుకోసం మసూద్ బీ తనఅల్లుళ్లతో కలిసి ప్లాన్ చేసింది.

చంపేశారిలా

ఖాజాను మట్టుబెట్టేందుకు చాంద్రాయణ గుట్టఫాతీమానగర్ కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్హషమ్, హస్మాబాద్ కు చెందిన మహ్మద్ రషీద్,సిద్దిపేట గజ్వేల్ కు చెందిన మహ్మద్ బషీర్అహ్మద్ ఖురేషి లతో కలిసి మసుదా బీ ప్లాన్ చేసింది. ఇందులో హస్మాబాద్కు చెందిన ఖాజాస్నేహితుడు ఆటో డ్రైవర్ రషీద్ తో ఒప్పందంకుదుర్చుకుం ది. తమ ప్లాన్ లో భాగంగా ముగ్గురు కలిసి ఖాజాను 2001 జూన్ 4న బండ్లగూడలోనికల్లు కాంపౌండ్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి పక్కనే ఉన్న శాస్త్రీపురంలోని ద్రాక్ష తోటలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు ఖాజా తలపై బండరాళ్లతో మోది హత్య చేసిపారి పోయారు.

పురోగతి లేక క్లోజ్ చేశారు

గుర్తు తెలియని వ్యక్తి హత్యగా రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంచేసిన దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసు క్లోజ్ చేశారు. ఐతే ఈ కేసులో 18ఏళ్ల తరువాత సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఖాజా హత్యకు సంబంధించిన సమాచారం అందింది. దీంతో హతుడి తల్లి మసూదబీ,ఆటోడ్రైవర్ హశమ్,రషీద్, అహ్మద్ ఖురేషిలతో పాటుమృతుడి తల్లి మసూద్ బీని అరెస్ట్ చేశారు.18 ఏం