మత విద్వేషాలు, ఘర్షణలు సృష్టిస్తే చర్యలు తప్పవు

మత విద్వేషాలు, ఘర్షణలు సృష్టిస్తే చర్యలు తప్పవు

హైదరాబాద్: రాష్ట్రంలో, హైదరాబాద్ లో చిన్న సంఘటన కూడా జరగకుండా..ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఆరేళ్లగా ఒక్క సంఘటన కూడా జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుందన్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆసరాగా చేసుకుని మత విద్వేషాలు, మత ఘర్షణలు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని.. ఇలాంటి విద్వంసక శక్తులపై పోలీస్ శాఖ కట్టిన చర్యలు తీసుకుందన్నారు.  సోషియల్ మీడియా పై పోలీస్ శాఖ పూర్తి స్థాయి నిఘా పెట్టిందని..శాంతికి భగ్నం కలిగే ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవని..ఇలాంటివి అడ్డుకోవడానికి కానిస్టేబుల్ నుండి ఐజీ వరకు నిఘా ఉంచాలని ఆదేశాలిచ్చామన్నారు.

పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందజేయాలని కోరుచున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకొనేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలకుండా చర్యలు తీసుకుంటామని.. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సోషియల్ మీడియాలో వచ్చే రూమర్స్ ను నమ్మెద్దన్నారు.  51,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని.. పోలీస్ వ్యవస్థతో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.