- రూ. 3.27 కోట్లతో నెక్నంపూర్ నుంచి అల్కాపూర్ వైజంక్షన్ అభివృద్ధి
హైదరాబాద్సిటీ,వెలుగు: గ్రేటర్ లో ట్రాఫిక్ సమస్య నివారణకు హెచ్ఎండీఏ కొత్త ప్లాన్వేసింది. మెయిన్రోడ్లకు చిన్న చిన్నరూట్లను లింక్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆధ్వర్యంలో లింక్ రోడ్లను( షార్ట్ కట్) డెవలప్చేయాలని నిర్ణయించారు.
మెయిన్రోడ్లపైనే అత్యధికంగా వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్స్తో పాటు పొల్యూషన్సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే మెయిన్రోడ్లను కలిపే చిన్న చిన్న ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేస్తే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.
రూ. 3.27 కోట్ల ఖర్చు
ముందుగా హెచ్ఎండీఏ పరిధిలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని చిన్నరోడ్లను మెయిన్ రోడ్లతో లింక్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా నెక్నాంపూర్ నుంచి అల్కాపురి రోడ్ ను విస్తరించి వై జంక్షన్ వద్ద కలిపి డెవలప్చేయనున్నారు.
అల్కాపూర్నుంచి పైప్లైన్రోడ్ ను కూడా ఎక్స్టెండ్చేయాలని ప్రపోజల్స్రెడీ చేశారు. ఈ రెండు రోడ్లు 80 ఫీట్లు ఉంటాయని, పనుల కోసం రూ.3.27 కోట్లు వెచ్చించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
