
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ లీడర్లు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. వీడియోలు తీసి పోలీసులకు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో… TRS లీడర్లు డబ్బులు పంచుతున్న విజువల్స్ ను రికార్డ్ చేశారు. చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. భువనగిరి పోలింగ్ కేంద్రాల దగ్గర్లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర టీఆర్ఎస్ ఎంపీపీ డబ్బులు పంచుతున్నారంటూ సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. సూర్యాపేటలోనూ టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచడం వివాదాస్పదమైంది. సూర్యాపేటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త రమేశ్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు అపోజిషన్ లీడర్లు.