గత ప్రభుత్వం వందల ఎకరాలు కబ్జా చేసి 111 జీఓను ఎత్తేసింది : కిషన్ రెడ్డి

గత ప్రభుత్వం వందల ఎకరాలు కబ్జా చేసి 111 జీఓను ఎత్తేసింది : కిషన్ రెడ్డి

 హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంత భూములు కబ్జాలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ భూములను పేదప్రజలకు అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం జరుగుతుందని దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అంబర్ పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు వృథా చేసిందని ఫైర్ అయ్యారు. వందల ఎకరాలను కబ్జా చేసి 111 జీఓ ను ఎత్తివేసిందని ఆరోపించారు.

 గత ప్రభుత్వం భూములను ఆక్రమించి అగాడాలకు పాల్పడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ నాయకులతో కలిసి లండన్ వెళ్తుందని విమర్శించారు. అక్కడి నదిని చూపించి దానిలాగా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారని అసలు నగరంలో మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించిందే మజిలీస్ పార్టీ అని ఆరోపించారు. హైదరాబాద్ ను రక్షించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.