నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే... కొడంగల్లో దీక్ష చేస్తా: ఎంపీ అర్వింద్

నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే... కొడంగల్లో దీక్ష చేస్తా: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్.  నిదులన్నీ నల్గొడ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఖరిని నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్ లో దీక్ష చేస్తానని చెప్పారు.   అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు అర్వింద్.  

ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందన్నారు. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ లకు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. పసుపు పంటపై కాంగ్రెస్  తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గతంలో కంటే లక్షన్నర ఎకరాల సాగు పెరిగిందన్నారు. గత పాలకుల విధానాల వల్లే పసుపు రైతులకు కష్టాలు వచ్చాయన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం బీజేపీతోనే సాధ్యమన్నారు.