గోల్డ్ రేటును దాటిన మిర్చి ధర

గోల్డ్ రేటును దాటిన మిర్చి ధర

రాష్ట్రంలో మిర్చి బంగారమైంది. గోల్డ్ రేట్లను వెనక్కి నెడుతూ రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. ఒకప్పుడు 10 వేలు దాటితే గొప్ప అనుకున్న.. రైతన్నకు ఎర్రబంగారం కాసులు కురిపిస్తోంది. ఇవాళ ఏకంగా దేశీయ మిర్చి ధర తులం బంగారం ధరను దాటింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. దేశీయ మిర్చి ధర క్వింటాల్ 55 వేల 551 రూపాయిలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని అధికారులు చెబుతున్నారు. మరో వైపు పత్తి కూడ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి ధర 12 వేల 110 పలికింది. ఇది కూడా అత్యధిక ధర అని అధికారులు అంటున్నారు. మిర్చి ధర రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చంచల్ గూడ జైలుకు డ్రగ్స్ కేసు నిందితులు