అత్తారి రైలులా ఎక్కేస్తున్నారా..? : ఒక్క రైల్వేస్టేషన్ లో 16 లక్షల జరిమానానా..!

అత్తారి రైలులా ఎక్కేస్తున్నారా..? : ఒక్క రైల్వేస్టేషన్ లో 16 లక్షల జరిమానానా..!

టికెట్ తీసుకోకుండానే ట్రైన్స్​ లో ప్రయాణిస్తున్నారా..? ఎవరూ రారని, ఏమీ కాదని అలవాటులో పొరపాటు చేస్తున్నారా..? అయితే.. జాగ్రత్త..! ఇది హెచ్చరిక కాదు.. జస్ట్​ సూచన మాత్రమే.. ఈసారైనా ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా టికెట్స్​ తీసుకోండి. లేదంటే మీకు ఇదే పరిస్థితి ఎదురుకావొచ్చు..

అసలేం జరిగింది..? 

ముంబైలో చాలామంది ప్రయాణికులు టికెట్​ లేకుండానే ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. ఇలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతిరోజూ చాలామంది టికెట్లు లేకుండా జర్నీ చేస్తున్నారు. దీని వల్ల రైల్వేశాఖకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోంది. 

టికెట్​ లేకుండా ప్రయాణించే వారిపై తాజాగా దక్షిణ మధ్య రైల్వేశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై కొరడా ఝలిపిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్​ 16వ తేదీన)  167 మంది టీసీలు (టికెట్ తనిఖీ ఆఫీసర్లు లేదా టికెట్ కలెక్టర్​ ) ఆకస్మికంగా ట్రైన్లలో తనిఖీలు చేపట్టారు. 

ముంబైలోని కల్యాణ్​ రైల్వేస్టేషన్​ లో 167 మంది టీసీలు ఒక బృందంగా ఏర్పడి.. ప్రయాణికుల టికెట్లను చెక్ చేశారు. ఈ తనిఖీల్లో వందల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు పట్టుబడ్డారు. 

మొత్తం 4 వేల 438 మంది నుంచి 16 లక్షల 85 వేలను జరిమానాగా విధించారు రైల్వేశాఖ అధికారులు. ఒక్కో టీసీ సగటున దాదాపు 27 మందిని చెక్​ చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక్కో వ్యక్తి వద్ద నుంచి దాదాపు 10 వేల 95 రూపాయలు వసూలు చేశారు. 

తనిఖీల సమయంలో టీసీలకు రక్షణగా ఆర్​పీఎఫ్​ సిబ్బంది విధుల్లో ఉన్నారు. టికెట్ చెకింగులకు సంబంధించిన వీడియోలను సెంట్రల్ రైల్వేశాఖ అధికారులు ఎక్స్​ (ట్విట్టర్​) లో షేర్ చేశారు. 

ప్రయాణికులందరూ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ట్రైన్లలో ప్రయాణించాలని రైల్వేశాఖ అధికారులు కోరుతున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు జరుగుతాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రత కోసమే చెకింగులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.