రెండు నెలల్లో పడాల్సిన వాన రెండ్రోజుల్లో కురిసింది

రెండు నెలల్లో పడాల్సిన వాన రెండ్రోజుల్లో కురిసింది
  • యూరప్‌‌‌‌‌‌‌‌లో వరదలు.. 110 మంది మృతి
  • జర్మనీ, బెల్జియం అతలాకుతలం

బెర్లిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరదలు ముంచెత్తాయి. జర్మనీ, బెల్జియం దేశాలు అతలాకుతలమయ్యాయి. వరదల్లో చిక్కుకొని ఇప్పటివరకు 110 మంది మరణించారు. జర్మనీలో గురువారం రాత్రి నాటికి 1,300 మంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. అయితే డేటా డూప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల సంఖ్య పెరిగి ఉండొచ్చన్నారు. జర్మనీ, బెర్లిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్ది రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. ఈ రెండ్రోజుల్లో.. రెండు నెలల్లో పడాల్సిన వర్షం పడిందని వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటిరియోలాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. దీంతో గురువారం అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. వరదల ధాటికి వేలాది ఇండ్లు కూలిపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. జర్మనీలోని రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలాటినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో 60 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. పక్క రాష్ట్రం నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాలియాలో 43 మంది మరణించారని, సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. చాలా మంది ఇళ్లు కూలి చనిపోయారన్నారు. జనాలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోందని చెప్పారు. రోడ్లు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు దెబ్బతిన్నాయని.. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు. సహాయానికి 850 బలగాలను జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిలటరీ రంగంలోకి దించింది. కాగా, వరదల్లో మృతి చెందిన వారికి సాయం చేస్తామని జర్మనీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. డ్యామేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన సిటీలు, టౌన్లకు చేయూతనందిస్తామన్నారు. వాతావరణ మార్పులను ఆపగలిగితేనే ఇలాంటి సమస్యలను తగ్గించగలమని చెప్పారు. కాగా, బెల్జియంలో గల్లంతైన వాళ్ల ఆచూకీ కనిపెట్టడానికి సివిల్‌‌ ప్రొటెక్షన్‌‌ టీమ్స్‌‌ను ఇటలీ పంపింది.