పెద్దల అరాచకం: రేప్‌ బాధితురాలికే ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు

పెద్దల అరాచకం: రేప్‌ బాధితురాలికే ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు

వెస్ట్‌‌బెంగాల్‌‌లోతండా పెద్దల అరాచకం

సురి (పశ్చిమ బెంగాల్): ఓ గిరిజన మహిళ (32 )ను, ఆమె బాయ్ ‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ను కొందరు వ్యక్తులు బంధించి ఓ రోజు తర్వాత ఆ మహిళను గ్యాంగ్ రేప్ ‌‌‌‌‌‌‌‌చేశారు. విషయం ఊర్లో తెలియగా న్యాయం చేయాల్సిన పెద్దలు ఆ మహిళకే రూ. 10 వేలు, ఆమె బాయ్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ కు రూ. 50 వేల ఫైన్‌‌‌‌‌‌‌‌ వేశారు. వెస్ట్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని బిర్భుమ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మహ్మద్ ‌‌‌‌‌‌‌‌బజార్ ‌‌‌‌‌‌‌‌ఏరియాలో ఉండే ఆ మహిళ భర్త చనిపోయాడు. ముగ్గురు పిల్లలున్నారు. ఆగస్టు
18న సాయంత్రంతన బాయ్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌పై ఇంటికి వస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో కొందరు వ్యక్తులు బైక్‌‌‌‌‌‌‌‌ను ఆపి వాళ్లిద్ద‌రినీ ఒక రూమ్‌‌‌‌‌‌‌‌లో బంధించారని పోలీసులు చెప్పారు. తర్వాత రోజు ఆ మహిళను అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ రేప్‌‌‌‌‌‌‌‌చేశారని, ఆ మహిళ శనివారం పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేసిందని తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టుచేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.