క్రెడిట్ కార్డుతోనూ ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం పేమెంట్లు

క్రెడిట్ కార్డుతోనూ ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం పేమెంట్లు

ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం పేమెంట్లు క్రెడిట్ కార్డుతోనూ
డిజిటల్ పేమెంట్లను మరింత పెంచడానికే.. 
రెపో రేటు 50 బేసిస్‌ పాయింట్లు పైకి.. 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌ ,వెలుగు: దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు డెబిట్‌‌‌‌ కార్డును మాత్రమే యూపీఐ ప్లాట్‌‌ఫామ్స్‌‌ (ఫోన్‌‌పే, పేటీఎం, గూగుల్ పే వంటివి) కు యాడ్ చేసుకోవడానికి వీలుండేది. తాజా ఎంపీసీ మీటింగ్‌‌లో  క్రెడిట్‌‌ కార్డులను కూడా యూపీఐ ప్లాట్‌‌ఫామ్స్‌‌కు యాడ్ చేసుకోవడానికి ఆర్‌‌‌‌బీఐ అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్స్ మరింతగా పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనావేస్తోంది. మొదట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇష్యూ చేసే రూపే క్రెడిట్‌‌ కార్డులతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేయనున్నారు. దీంతో పాటు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు, ఇతర ప్రీపెయిడ్‌‌ పేమెంట్ ఇన్‌‌స్ట్రుమెంట్స్‌‌ (పీపీఐ) ల ద్వారా జరిగే రికరింగ్‌‌ ట్రాన్సాక్షన్లపై ఈ–మేండెట్‌ను  ప్రస్తుతం ఉన్న రూ. 5 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు.  

ఇన్‌‌ఫ్లేషన్‌‌ అంచనాలు పెరిగినయ్‌‌
జియో పొలిటకల్ టెన్షన్లు, సప్లయ్ చెయిన్ సమస్యలతో  దేశంలో ఇన్‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఆర్‌‌‌‌బీఐ లిమిట్స్‌‌కు మించి నమోదవుతోంది. ఇలా పెరుగుతున్న ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కంట్రోల్ చేయడానికి ఆర్‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)  తాజా మీటింగ్‌లో రెపో రేటును (బ్యాంకులు ఆర్‌‌‌‌బీఐకి చెల్లించే వడ్డీని) 50 బేసిస్ పాయింట్లు (4.90 శాతానికి) పెంచింది. గత ఐదు వారాల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. షార్ట్‌‌ టెర్మ్‌‌లో బ్యాంకులు ఆర్‌‌‌‌బీఐ వద్ద డిపాజిట్‌‌ చేసినందుకు ఇచ్చే వడ్డీ (స్టాండింగ్ డిపాజిట్‌‌ ఫెసిలిటీ) రేటును 4.65 శాతానికి, షార్ట్‌‌ టెర్మ్‌‌లో తీసుకునే ఫండ్స్‌‌పై  బ్యాంకుల నుంచి ఆర్‌‌‌‌బీఐ వసూలు చేసే వడ్డీ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు) రేటును 5.15 శాతానికి తాజా ఎంపీసీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో ఇన్‌‌ఫ్లేషన్‌‌ 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌‌‌‌బీఐ అంచనావేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌ ఎంపీసీ మీటింగ్‌‌లో పెట్టుకున్న అంచనా (5.7 శాతం) కంటే ఇది 100 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనించాలి.  ఇన్‌‌ఫ్లేషన్ అంచనాలను మార్చినప్పటికీ, దేశ జీడీపీ గ్రోత్‌‌ రేటు అంచనాలను మాత్రం 7.2 శాతంగానే ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీ కొనసాగించింది.   ఆహారపదార్ధాల ధరలు,  పెట్రోల్‌‌, డీజిల్‌‌, కమోడిటీ ప్రొడక్ట్‌‌ల ధరలు బాగా పెరగడంతోనే ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతోందని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్‌‌ చెప్పారు. 

కో–ఆపరేటివ్ బ్యాంకులకు గుడ్‌‌ న్యూస్‌‌..
కో–ఆపరేటివ్ బ్యాంకులు ఇచ్చే హోమ్‌‌ లోన్ల లిమిట్‌‌ను  రిజర్వ్ బ్యాంక్ డబుల్ చేసింది. ఇప్పటి వరకు కో–ఆపరేటివ్ బ్యాంకులు గరిష్టంగా రూ. 70 లక్షలు మాత్రమే ఇండివిడ్యువల్‌‌ హోమ్‌‌ లోన్‌‌గా ఇవ్వడానికి వీలుండేది. ఈ లిమిట్‌‌ను రూ. 1.40 కోట్లకు ఆర్‌‌‌‌బీఐ పెంచింది. అలానే రూరల్ బ్యాంకులు ఇచ్చే హోమ్‌‌ లోన్ల లిమిట్‌‌ను రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షలకు పెంచారు.  అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు  డోర్‌‌‌‌ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్‌‌లను అందించేందుకు ఆర్‌‌‌‌బీఐ అనుమతిచ్చింది.

పెరగనున్న వడ్డీ భారం.. 
హోమ్‌‌, వెహికల్‌‌, పర్సనల్ లోన్లు, ఇతర రకం లోన్లపై వడ్డీ భారం మరింత పెరగనుంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో బ్యాంకులు,  ఫైనాన్షియల్ సంస్థలు కూడా తమ వడ్డీ రేట్లను పెంచనున్నాయి.  కిందటి నెలలో  రెపో రేటును సడెన్‌‌గా 40 బేసిస్ పాయింట్లు పెంచి రిజర్వ్ బ్యాంక్‌‌ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి ఎస్‌‌బీఐ, బీఓబీ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు  వంటి టాప్‌‌ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ హోమ్‌‌ లోన్లు, ఎక్సటర్నల్‌‌ లెండింగ్ రేటుతో లింక్ అయి ఉన్న లోన్లపై వడ్డీని పెంచుతూ వస్తున్నాయి. 

2022‑23  ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌‌‌‌ఫ్లేషన్ అంచనాలను 6.7 శాతానికి ఆర్‌‌‌‌బీఐ పెంచింది. కానీ, జీడీపీ గ్రోత్ అంచనాలను మాత్రం 7.2 శాతం దగ్గరే కొనసాగించింది. రేట్లు ఎక్కువగా ఉంటే గ్రోత్ తగ్గదా? ఇన్‌‌ఫ్లేషన్‌‌ను తగ్గించడానికి ఇదెలా సాయపడు తుంది? పెరిగిన ఇన్‌‌ఫ్లేషన్‌‌కు కారణం గ్లోబల్‌‌ అంశాలే నని ఆర్‌‌‌‌బీఐ అంచనావేస్తోంది. గ్రోత్ స్ట్రాంగ్‌‌గా ఉంటుందని ఆర్‌‌‌‌బీఐ అనుకుంటోంది కాబట్టి రానున్న ఎంపీసీ మీటింగ్‌‌లో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపు ఉండకపోవచ్చు. రేట్లు పెంచే ముందు ఆర్‌‌‌‌బీఐ కొన్ని నెలలు ఆగొచ్చు. మానిటరీ పాలసీ కఠినంగా మారడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో, రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ తగ్గుతుందని ఆందోళన పడుతున్నాం. 
- నిఖిల్ గుప్తా, మోతిలాల్‌ ఓస్వాల్, చీఫ్ ఎకనామిస్ట్‌