భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్ల వల్లే చంద్రుడిపై నీరు!

భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్ల వల్లే చంద్రుడిపై నీరు!
  • భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్ల వల్లే చంద్రుడిపై నీరు!
  • హవాయి వర్సిటీ స్టడీలో వెల్లడి
  • చంద్రయాన్-1 మిషన్ డాటాను అధ్యయనం చేసిన సైంటిస్టులు

న్యూఢిల్లీ : చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలలో వెల్లడైంది.. చంద్రుడి ఉపరితలంపై నిత్యం చీకట్లోనే ఉండే ప్రాంతంలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. తాజాగా ఇటీవలి చంద్రయాన్‌‌‌‌-3 ప్రయోగంలోనూ రోవర్ నీటి జాడలను గుర్తించింది. అయితే, అసలు వాతావరణమే లేని చంద్రుడి ఉపరితలంపై నీరు ఎలా ఏర్పడిందనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సైంటిస్టు కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయారు.

తాజా పరిశోధనలో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. చంద్రుడిపై నీరు ఏర్పడడానికి కారణం భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లేనని యూనివర్సిటీ ఆఫ్​ హవాయి శ్రాసవేత్తల పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా మన దేశం గతంలో చేపట్టిన చంద్రయాన్‌‌‌‌–1 మిషన్ లో సేకరించిన వివరాలను స్టడీ చేశారు. రిమోట్ సెన్సింగ్​ సమాచారాన్ని లోతుగా విశ్లేషించగా.. భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై ఉన్న రాళ్లు, మినరల్స్ ను కరిగించి నీటి పుట్టుకకు కారణమై ఉంటాయని గుర్తించారు.

ALSO READ: గిరిజన బంధు ఏడవాయే?..ప్రకటించి ఏడాదైనా అమలు చేయని సర్కారు 

ఈమేరకు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ ఈ పరిశోధనా వివరాలను ప్రచురించింది. శక్తిమంతమైన అణువులు ఉండే సౌరగాలి చంద్రుడిని బలంగా తాకినపుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశం ఉంది. అయితే, భూ అయస్కాంత ఆవరణంగుండా ప్రయాణిస్తున్న సమయంలో చంద్రుడికి సౌరగాలి తాకే అవకాశం లేదని సైంటిస్టులు చెప్పారు. ఆ సందర్భంలోనూ చంద్రుడిపై నీరు ఏర్పడిందని గుర్తించడంతో కారణాలను గుర్తించేందుకు పలు అధ్యయనాలు జరిపారు. ఈ అధ్యయనాల తర్వాత భూ వాతావరణంలోని ప్రోటాన్లే చంద్రుడిపై నీరు ఏర్పడేందుకు దోహదం చేసి ఉంటాయని తేల్చారు.