
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. కారణం ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అవడమే. సాధారణంగా శంకర్ సినిమాలంటే భారీగా ఉండటమే కాకుండా.. షూటింగ్ కి కూడా చాలా సమయం పడుతుంది. ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవడు. అందుకే ఆయన సినిమాల రిలీజ్ లేట్ అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అదే జరిగింది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండేళ్లుగా సాగుతూ వస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా శంకర్ దర్శకుడు అవడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ముందు ఈ సినిమా షూటింగ్ సజావుగానే సాగింది. మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 రావడంతో రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది శంకర్ కి. అందుకే గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్య అయ్యింది. దాంతో రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఇక రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమా నుండి బయటకు రావాలని చూస్తున్నాడట. ఈ నేపధ్యంలోనే మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, రామ్ చరణ్ కి ఫ్రీడమ్ ఒకేసారి రానున్నాయి. అదేంటంటే.. మరో పదిరోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కానుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది. మరో పదిరోజుల్లో ఇది కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. అనంతరం మిగతా కార్యక్రామాలు కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా సినిమా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ న్యూస్ తెలియడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎట్టేకలకు సినిమా విడుదలకు సిద్ధమౌతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.