రేపు లేదా ఎల్లుండి రాష్ట్రానికి ‘నైరుతి’

రేపు లేదా ఎల్లుండి రాష్ట్రానికి ‘నైరుతి’

హైదరాబాద్‌, వెలుగు: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ఈ నెల 13 లేదా 14వ తేదీన ప్రవేశించే చాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక నైరుతి రుతుపవనాలు శనివారం ముంబైకి చేరుకున్నాయని ఇండియా మెటిరియోలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలకు, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ఏరియాలకు, కర్నాటకలో మరిన్ని చోట్లకు రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది. వచ్చే కొన్ని రోజుల్లో అటు నార్త్ అరేబియా సముద్రం, గుజరాత్.. ఇటు తెలంగాణ, ఏపీ, బంగాళాఖాతం, బెంగాల్, సిక్కిం, ఒడిశా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.