పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: పోలీస్ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు కటాఫ్ తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. అంతకుముందు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో కటాఫ్ శాతాన్ని ఎస్సీ, ఎస్టీలకు 30,  బీసీలకు35, ఓసీలకు 40 శాతం విధిస్తూ నియామక బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో  దిగొచ్చిన ప్రభుత్వం దిగొచ్చింది. కటాఫ్ శాతాన్ని తగ్గిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

తాజా జీవో ప్రకారం కటాఫ్ మార్కులు

తాజాగా సవరించిన జీవో ప్రకారం.. ఓసీ అభ్యర్థులకు 30, బీసీ అభ్యర్థులకు 25, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. దీని ప్రకారం 200 మార్కులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో  ఓసీ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 554 ఎస్ఐ, 15,664 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించింది. వాటికి సంబంధించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తూ ఇవాళ జీవో జారీ చేసింది.