జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..
  • పాలమూరు ఐటీ హబ్​ భూముల్లో పల్లి పంట
  • కరీంనగర్​లో పట్టుమని పదుల సంఖ్యలోనే జాబ్​లు
  • వరంగల్​లో టెకీలకు రూ. 12 వేలు దాటని శాలరీలు
  • మహబూబ్​నగర్, నిజామాబాద్​లో స్లోగా బిల్డింగ్స్​ నిర్మాణం
  • టైంకు సర్కారు నిధులివ్వకపోవడంతో పనులు పెండింగ్​
  • వర్క్​ స్టార్ట్​ చేసేందుకు ఇంట్రస్ట్​ చూపని కంపెనీలు
  • సిద్దిపేటకు ఐటీ టవర్​.. 10న సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌‌‌‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా సక్సెస్​ కాలేదు. కొద్ది నెలల కింద కరీంనగర్​, అంతకుముందు వరంగల్​లో ప్రారంభించిన ఐటీ సెంటర్లలో వర్క్​స్టార్ట్​ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలు పెద్దగా ఇంట్రెస్ట్  చూపడం లేదు. ఆయా జిల్లాల్లో పట్టుమని పదుల సంఖ్యలోనూ ఉద్యోగాలు రాలేదు. అక్కడ టెకీల శాలరీస్​ రూ. 12 వేలు కూడా దాటట్లేదు. ఇక మహబూబ్​నగర్, నిజామాబాద్​ జిల్లా కేంద్రాల్లో బిల్డింగ్​ పనులు డెడ్  స్లోగా నడుస్తున్నాయి. మహబూబ్​నగర్​లో ఐటీ హబ్ కోసం సేకరించిన​ భూముల్లో పల్లి సాగు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వేల ఉద్యోగాలన్నారు.. పదుల్లోనూ ఇవ్వలేదు

కరీంనగర్​లోని లోయర్​ మానేర్​ డ్యామ్​ సమీపంలో రూ. 34 కోట్ల అంచనాతో నిర్మించిన ఐటీ టవర్​ను ఈ ఏడాది జులై 21న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా గ్రాండ్​గా ప్రారంభించారు. 11 కంపెనీలు అగ్రిమెంట్​ చేసుకున్నాయని షిఫ్ట్‌‌కు 1,100 నుంచి 1,200 మంది చొప్పున 3,300 నుంచి 3,600 మందికి జాబ్స్​ వస్తాయని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటించారు. కంపెనీలకు స్పేస్ అలాట్ చేసి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన ప్రోగ్రెస్​ లేదు. టవర్ ప్రారంభం రోజు 432 మందికి జాయినింగ్​ ఆర్డర్స్​ ఇవ్వగా ప్రస్తుతం ఒకటీ రెండు కంపెనీలకు చెందిన పది, పదిహేను మందికి మించి పనిచేయడం లేదు. దీంతో ఘనంగా ప్రారంభమైన ఐటీ టవర్​ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇదే క్యాంపస్​లో ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) రీజినల్​ సెంటర్​ యాక్టివిటీస్​ కూడా ప్రారంభం కాలేదు.

ఖమ్మంలో మూడేండ్లకు పూర్తయిన నిర్మాణం

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణం మూడేండ్ల తర్వాత పూర్తయింది. మంత్రి కేటీఆర్​ సోమవారం దీన్ని ప్రారంభించ నున్నారు. 2017లో రూ.25 కోట్లతో నిర్మాణ పనులు స్టార్ట్​ చేశారు. 16 కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపుతామని అంటున్నప్పటికీ కరీంనగర్​, వరంగల్​ అనుభవాలు చూశాక ఇక్కడి నిరుద్యోగులూ డల్​ అవుతున్నారు.

11 కంపెనీలు అగ్రిమెంట్​ చేసుకున్నాయని షిఫ్ట్‌‌‌‌కు 1,100 నుంచి 1,200 మంది చొప్పున 3,300 నుంచి 3,600 మందికి జాబ్స్​ వస్తాయని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటించారు. కంపెనీలకు స్పేస్ అలాట్ చేసి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన ప్రోగ్రెస్​ లేదు. టవర్ ప్రారంభం రోజు 432 మందికి జాయినింగ్​ ఆర్డర్స్​ ఇవ్వగా ప్రస్తుతం ఒకటీ రెండు కంపెనీలకు చెందిన పది, పదిహేను మందికి మించి పనిచేయడం లేదు. దీంతో ఘనంగా ప్రారంభమైన ఐటీ టవర్​ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇదే క్యాంపస్​లో ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) రీజినల్​ సెంటర్​ యాక్టివిటీస్​ కూడా ప్రారంభం కాలేదు.

శాలరీలు రూ.12 వేలు దాటట్లే

వరంగల్​ మడికొండ ఇండస్ట్రియల్‍ ఏరియాలో ఈ ఏడాది జనవరి 7న టెక్​ మహీంద్రా న్యూ బ్రాంచ్‍, సైయెంట్‍ఐటీ సెంటర్‍ న్యూ బిల్డింగ్​ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఓరుగల్లుకు ఐటీ సెంటర్లు రావడానికి ఇది ఆరంభమేనని, ఐటీ రంగంలో వరంగల్​ సిటీని  ముంబై, పుణెలా మారుస్తామని హామీ ఇచ్చారు. దగ్గర్లో హెలికాప్టర్​ ల్యాండింగ్‍ సెంటర్​ పెడతామన్నారు. వీటి ద్వారా 8 వేల నుంచి 9 వేల మందికి జాబ్స్​ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ  వేల మందికి కాదు కదా 200 మందికి మించి జాబ్​లు రాలేదు. సిస్టమ్​ ఇంజినీర్ల మంత్లీ శాలరీలు రూ.12 వేల నుంచి రూ. 14 వేలు దాటట్లేదు. కొత్తగా మరే ఐటీ కంపెనీ రాలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.

రెండు జిల్లాల్లో ఇంకా ఎక్కడికక్కడే

మహబూబ్​నగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఐటీ సెంటర్ల నిర్మాణం డెడ్​స్లోగా సాగుతోంది. మహబూబ్​నగర్​లో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్​ పార్కుకు మంత్రి కేటీఆర్​ 2018 జులై 7న శంకుస్థాపన చేశారు. ఈ ఐటీ పార్కుతో పాలమూరు దశ తిరుగుతుందని, 15 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 23 ఐటీ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. గతేడాది రూ. 28 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి 2019 నవంబర్​ 1న భూమి పూజ చేశారు. కానీ సరిపడా ఫండ్స్​ లేక పనులు లేట్​ అవుతున్నాయి. దీంతో భూములు ఇచ్చిన రైతులు మళ్లీ పల్లి చేన్లు వేశారు. 40 శాతం పనులే పూర్తయ్యాయి. నిజామాబాద్​సిటీలో కొత్త కలెక్టరేట్ పక్కన రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‍కు రెండేండ్ల కింద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినా పనులు లేట్​ అవుతున్నాయి.

సిద్దిపేటకు ఐటీ టవర్ 10న సీఎం శంకుస్థాపన

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటకు ఐటీ టవర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. గజ్వేల్ సెగ్మెంట్​ కొండపాక మండలం దుద్దెడ గ్రామ పరిధిలోని 668 సర్వే నెంబరులో 3 ఎకరాల ప్లేస్​ను కేటాయించి, టవర్ నిర్మాణ పనులకు రూ. 45 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 10న సీఎం కేసీఆర్ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజీవ్ రహదారిని ఆనుకొని నాగులబంద వద్ద నిర్మించిన ప్రసాద్ ఐ ఇన్​స్టిట్యూట్, టూరిజం హరిత హోటల్ మధ్యలో 3 ఎకరాల్లో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనున్నారు.  ఈ నెల 10న సీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన సమక్షంలోనే ఇన్ఫోసిస్ తో పాటు పలు కంపెనీలతో ఐటీ శాఖ ఎంవోయూలు కుదుర్చుకోనుంది.