దేశంలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల విజయానికి ఊతమివ్వాలి

దేశంలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల విజయానికి ఊతమివ్వాలి

హైదరాబాద్​, వెలుగు: సమాజానికి మేలు చేసే టెక్నాలజీలు, ప్రొడక్టులను తయారు చేసే స్టార్టప్​లను ఎంకరేజ్​ చేయడానికి ఒప్పో మొదలుపెట్టిన ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్  రెండవ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​లో శుక్రవారం ముగిసింది. డెమో సందర్భంగా, డిజిటల్ హెల్త్‌‌‌‌‌‌‌‌లో వినూత్న టెక్నాలజీ సొల్యూషన్స్​ కోసం భారతదేశంలోని టాప్–10 టెక్నాలజీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించాయి.

ఇందులో గెలిచిన మొదటి నాలుగు విజేతలు ఈ ఏడాది చివరిలో జరిగే ఒప్పో రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్  ప్రపంచస్థాయి ఫైనల్‌‌‌‌‌‌‌‌లో తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించడం ద్వారా 46 వేల డాలర్లు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ సందర్భంగా ఒప్పో ఇండియా  ఆర్​&డీ హెడ్ తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ తాము దేశంలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల విజయానికి ఊతమివ్వాలని  స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌కు విలువను చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.  ఒప్పో ఎలివేట్ ప్రోగ్రాం ద్వారా, ఒప్పో అద్భుతమైన టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు సాయం చేస్తూనే ఉంటుందని చెప్పారు.