ప్రొటీన్​ తీసుకోవడంలో మనమే బెస్ట్

ప్రొటీన్​ తీసుకోవడంలో మనమే బెస్ట్
  • హైదరాబాదీలకు ఆరోగ్యంపై అవగాహన ఎక్కువే
  • చెన్నై, బెంగళూరుల్లో సగం మందికి తెలియదు
  • పాల ఉత్పత్తులు వాడితే 80 శాతం సమస్య పరిష్కారం
  • సౌతిండియా ప్రొటీన్ గ్యాప్ సర్వే ఫలితాల వెల్లడి

హైదరాబాద్, వెలుగుసరైన ఆహారమే ఆరోగ్యానికి మార్గం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్లలో దేహానికి లభించినప్పుడే పోషకాహారం తీసుకున్నట్టు లెక్క. సమయానికి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పిల్లల ఎదుగుదలకు, శారీరక వికాసానికి సమతుల ఆహారం ప్రధానం. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, ప్రొటీన్స్ ఇలా ప్రతీది అవసరమే. చాలా మంది పోషకాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పెంపొందడానికి కావల్సిన ప్రొటీన్లు శరీరానికి అందడం లేదు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రొటీన్ అవసరం గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదని గోద్రెజ్ అగ్రోవెంట్, జెర్సీ డెయిరీ సంస్థ సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్ పేరుతో  నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ప్రోటీన్ అవసరాలు తెలియవు

మాంసాహారం, పప్పు దినుసులు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లుంటాయి. అయితే ఈ విషయంపై ఎంతమేరకు అవగాహన ఉందన్న అంశంపై చేసిన సర్వేలో 68 శాతం మందికి ప్రొటీన్ అంటే ఏంటో తెలియదని తేలింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో దాదాపు 600 మందిలో ప్రొటీన్ డిఫిషెన్సీ.. ప్రోటీన్ పై అవగాహనకు సంబంధించి సర్వే నిర్వహించారు. ఈ  సర్వేలో 92శాతం మంది పాల ఉత్పత్తుల ద్వారా ప్రోటీన్ అందుతుందని చెప్పారు. కానీ, వారిలో 32 శాతం మంది మాత్రమే పాల ఉత్పత్తులను తీసుకుంటున్నారు. మంసాహారుల కన్నా శాఖహారుల్లో ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. శాఖహారం తీసుకునే వారిలో 62 శాతం మందికి ప్రోటీన్ లోపం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఎప్పుడూ పాలు తాగని వాళ్లలో 83 శాతం మందిలో ప్రోటీన్ డిఫిషెన్సీ ఉన్నట్లు సర్వేలో తెలిపారు. సర్వే లో హైదరాబాద్​ జనాలకు ప్రొటీన్ పట్ల అవగాహన ఎక్కువ ఉన్నట్లు తేలింది. ప్రోటీన్ అవసరం గురించి బెంగళూరులో 95 శాతం, చెన్నైలో 75శాతం మంది ప్రజలకు సరైన సమాచారం లేదు. హైదరాబాదీల్లో మాత్రం 32 శాతం మందికే అవగాహన లేదు. వెజిటేరియన్స్ లో బేసిక్ డెయిలీ ప్రొటీన్ అవసరంపై కూడా హైదరాబాదీలకు ఉన్న అవగాహన ఎక్కువే. సమృద్ధిగా పాలు తాగే వారిలో 80 శాతం మందికి ప్రొటీన్ సఫిషెంట్ ఉంది.

పాలు, పెరుగు హెల్త్​కి మంచివి

– ధరణి కృష్ణన్, న్యూట్రిషియన్