టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభించనున్న కేసీఆర్

టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభించనున్న కేసీఆర్

హైదరాబాద్: టీ హబ్‌ –2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడమే అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు మాటలను కేటీఆర్ ఈ సందర్భంగా  ఉటంకించారు.  కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్‌... హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని అన్నారు.

టీ హబ్‌ –2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌ను ఏర్పాటు చేశారు.