జెట్ స్పీడుతో జరుగుతున్న పుష్ప 2 పనులు

జెట్ స్పీడుతో జరుగుతున్న పుష్ప 2 పనులు

‘పుష్ప: ద రెయిజ్’ అంటూ దేశమంతా సెన్సేషన్ సృష్టించాడు అల్లు అర్జున్. ఇక ‘పుష్ప: ద రూల్’ అంటూ రావడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ మొదటి పార్ట్‌‌‌‌ని మించి సెకెండ్ పార్ట్ ఉండాలనే ఉద్దేశంతో కాస్త టైమ్ తీసుకుని మరీ మరింత పక్కాగా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు సుకుమార్. కంటెంట్‌‌‌‌ లాక్ చేయడం దగ్గర్నుంచి లొకేషన్ల ఎంపిక వరకు ఆచితూచి అడుగులు వేశాడు. అయితే కాస్త ఎక్కువ సమయం పట్టడం వల్ల బన్నీ ఫ్యాన్స్‌‌‌‌లో కాస్త కంగారు మొదలైంది. దాంతో కంగారుపడనవసరం లేదని, ‘పుష్ప 2’ పనులన్నీ జెట్ స్పీడులో జరుగుతున్నాయని నిన్న కన్‌‌‌‌ఫర్మ్ చేసింది టీమ్.

సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవి గోవారికర్, పోస్టర్ డిజైనర్‌‌‌‌‌‌‌‌ జాన్‌‌‌‌లతో కలిసి టెస్ట్ షూట్స్ చేస్తున్నాడు సుకుమార్. అంటే దీపావళికి ఫస్ట్ లుక్‌‌‌‌ రాబోతోందన్నమాట. ఇక ఈ సినిమాపై ఎంత బజ్ ఉందంటే.. రోజుకో వార్త పుట్టుకొస్తోంది. చాలావరకు విదేశీ అడవుల్లో తీస్తారని, బన్నీ పులితో ఫైట్ చేస్తాడని, అది హాలీవుడ్ రేంజ్‌‌‌‌లో ఉంటుందని, బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఇందులో నటించబోతున్నారని.. ఇలా ఎన్నో. మరి వీటిలో ఏవి నిజమో ఏవి కాదో, పుష్పరాజ్ ఈసారి ఏ రేంజ్‌‌‌‌లో రావడానికి ప్రిపేరవుతున్నాడో తెలియాల్సి ఉంది.