కేసీఆర్​ సభకెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా

V6 Velugu Posted on Aug 21, 2021

  • సీఆర్​ సభ బందోబస్తు డ్యూటీకి వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా

మెట్ పల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన బందోబస్తు డ్యూటీకి వెళ్లిన మెట్ పల్లి ఠాణా కానిస్టేబుళ్లు ముగ్గురు కరోనా బారిన పడ్డారు.  వారం రోజులుగా జగిత్యాల జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల హుజూరాబాద్ లో సీఎం ప్రోగ్రాం బందోబస్తుకు వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లు తిరిగి రాగానే అనారోగ్యానికి గురయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ముగ్గురూ హోం ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ముగ్గురికీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్​పూర్తయింది. 

Tagged CM KCR, Corona Positive, constables, , Huzurabad sabha, security duty

Latest Videos

Subscribe Now

More News