మూడు నెలల తర్వాత వచ్చిన పెండ్లి ముహూర్తాలు

మూడు నెలల తర్వాత వచ్చిన పెండ్లి ముహూర్తాలు

ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి ముధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. వచ్చే నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం అవుతుండడంతో రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది.

గత మూడాలతో 3 నెలలుగా అసలు పెళ్లి ముహూర్తాలే లేవు. వచ్చే నెల 4 నుంచి పెళ్లిలు, ఇతర శుభకార్యలకు ముహూర్తాలు బాగుండటంతో, ఒక్క డిసెంబర్ నెలలోనే హైదరాబాద్ లో కొన్ని వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. అటు దేశవ్యాప్తంగా డిసెంబర్, జనవరి నెలలో 32 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోయిన సంవత్సరం ఇదే సీజన్ లో 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే చాన్సుంది. డిసెంబర్ నెలలో ఐదారు ముహుర్తాలే బలంగా ఉన్నాయని... తిరిగి సంక్రాంతి తర్వాతే మంచి రోజులు ఉన్నాయంటున్నారు పండితులు. దీంతో డిసెంబర్ లో కొన్ని వేల జంటలు ఒక్కటికానున్నాయి.

మామూలుగా శ్రావణ మాసం అంటేనే పెళ్లి ముహూర్తలకు కేరాఫ్. కానీ, ఈసారి  శ్రావణంలో మూఢాలు రావడంతో పెంళ్లి ముహూర్తాలకు బ్రేక్ పడింది. వచ్చే నెల 4,7,11,17,18 తేదీల్లో ఎక్కువ సంఖ్యలో పెళ్లి ముహూర్తం బాగుండటంతో, వాటిపై ఆధారపడి బతికేవాళ్లకు చేతినిండా పనిదొరికింది. ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, మంగళ వాయిద్యాలు, కేటరింగ్, ఫోటో గ్రాఫర్స్, డీజేలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. 3 నెలలుగా బిజినెస్ లేక డీలా పడిపోయిన వ్యాపారులు, సీజన్  మొదలవుతుండడంతో బిజీ అయిపోయారు.