తుక్కుగూడలో అతిపెద్ద 56 ఫీట్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ

తుక్కుగూడలో అతిపెద్ద 56 ఫీట్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ

తెలంగాణలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రసిద్ధ చర్చిలలో  క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.దేవుని స్తుతించి..ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగుడ మున్సిపాలిటీ రావిర్యాల వద్ద వున్న వండర్ లా అమ్యుజ్ మెంట్ పార్క్ ను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. 

క్రిస్మస్ పండుగ సందర్భంగా అతిపెద్ద క్రిస్మస్ ట్రీ ని ఏర్పాటు చేశారు. పార్కు ను ప్రత్యేక లైటింగ్ కాంతులతో జిగేల్..జిగేల్ మంటూ మెరిసే విధంగా  అందంగా ముస్తాబు చేశారు. వారం రోజుల పాటు డీజే ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకుల తాకిడి రెట్టింపైంది. ఈ సందర్భంగా పార్కు లో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.  పర్యాటకుల ఆనందం కోసం వండర్ లా ఎల్లప్పుడూ నూతన ఈ వెంట్లను ఏర్పాటు చేస్తోందని, ఏంతో మంది భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ కు కూడా పార్కును ఆకర్షణీయంగా ముస్తాబు చేయడం జరిగిందని వండర్ లా అమ్యుజ్ మెంట్ పార్క్ హెడ్ మధు తెలిపారు. ఇందులో అతిపెద్ద 56ఫీట్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశామని చెప్పారు.