బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై హీరో రామ్ చరణ్ సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఓ గొప్ప నటుణ్ని కోల్పోయిందని, ఆయన ఆకస్మిక మరణం బాధిస్తుందన్నారు. చిత్ర పరిశ్రమ అత్యంత అసాధారణమైన నటుణ్ని , ఓ లెజెండ్ ని కోల్పోయిందన్నారు. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు రామ్ చరణ్.
ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో మహేశ్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ గా చేశారు. ఆయన వయసు 54. పెద్ద పేగు సంబంధిత వ్యాధి సోకడంతో, ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. 4 రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం కన్ను మూశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయారు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. అయితే కన్నతల్లి కన్ను మూసిన కొన్ని రోజులకే ఆరోగ్యం విషమించి ఇర్ఫాన్ కూడా మరణించారు.
The world of cinema has lost a crowned jewel. One of the most exceptional actors and the film industry will definitely miss the legend. May your soul rest in peace, Irrfan Khan ji. pic.twitter.com/qaBYTfr3xN
— Ram Charan (@AlwaysRamCharan) April 29, 2020
