లవర్ ట్రీట్ మెంట్ కోసం దొంగగా మారి..

లవర్ ట్రీట్ మెంట్ కోసం దొంగగా మారి..

డబ్బు కొట్టేసి దారిదోపీడీగా నమ్మించిండు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రియురాలి ట్రీట్ మెంట్ కోసం దొంగగా మారిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సంప్రీత్ సింగ్ వివరాల ప్రకారం..  ప్రకాశం జిల్లా పొదిలి వాసి మారం అచ్చిరెడ్డి (28) ఎంబీఏ చేశాడు. కోదాడ దగ్గరలోని కాపుగల్లులో అతడి మామయ్య తిరుపతిరెడ్డికి చెందిన పేపర్ మిల్​లో అకౌంటెంట్​గా చేరాడు.  ఏజెంట్ల దగ్గరి నుంచి డైలీ లక్షల్లో క్యాష్ కలెక్ట్ చేసేవాడు. అచ్చిరెడ్డి లవర్ రెండేండ్లుగా మానసిక వ్యాధితో పుణెలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. అందుకు డబ్బు అవసరమవడం, అప్పటికే అప్పులు కూడా ఉండడంతో మామ డబ్బు కొట్టేయడానికి ప్లాన్ వేశాడు.

ఈ నెల 25న  కోదాడ నుంచి సిటీకి వచ్చి, ముగ్గురు ఏజెంట్ల నుంచి రూ.8.51లక్షలు కలెక్ట్​ చేసుకున్నాడు. ఆ క్యాష్​ను  గుర్రంగూడలోని చెట్లపొదల్లో  దాచిపెట్టి.. తిరుపతిరెడ్డికి ఫోన్​చేసి ముగ్గురు బైక్​పై వచ్చి బ్యాగ్ ఎత్తుకెళ్లారని చెప్పాడు. మీర్ పేట పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. మీర్ పేట, ఎల్ బీనగర్ సీసీఎస్ పోలీసులు అచ్చిరెడ్డిపై అనుమానంతో విచారించగా, దొంగతనం ఒప్పుకొన్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.8.51లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు