
ఉప్పల్, వెలుగు: ఉప్పల్‌లోని హోల్ సేల్ కిరాణా షాపులో చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ గాంధీ నగర్ లోని నామన్ మార్కెటింగ్ హోల్ సేల్ కిరాణా షాపులో ఈ నెల 22న రాత్రి చోరీ జరిగింది. షాపు షటర్‌ను తెరిచి క్యాష్ కౌంటర్లోని రూ.7 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై షాపు నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను మహ్మద్ ఖాదర్, అబ్దుల్ ఖలీద్, షేక్ అబ్దుల్ మోహిన్ గుర్తించి బుధవారం అరెస్ట్ చేశారు. రూ.7 లక్షలను రికవరీ చేశారు. చోరీకి ముందు నిందితులు షాపులను సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు ఉప్పల్ అడ్మిన్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.