ఒకే షాపులో 20 రోజుల్లో రెండు సార్లు దొంగతనం.. నాగారం మారుతీనగర్‌‌లో ఘటన  

ఒకే షాపులో 20 రోజుల్లో రెండు సార్లు దొంగతనం.. నాగారం మారుతీనగర్‌‌లో ఘటన  

కీసర, వెలుగు : మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా కీసర పీఎస్​పరిధిలోని నాగారం మారుతీనగర్‌‌లో ఒకే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు 20 రోజుల్లో రెండు సార్లు దొంగతనం చేసి రూ.6 లక్షల సామగ్రి ఎత్తుకెళ్లారు. మారుతీనగర్​లోని శ్రీరామ ఎలక్ట్రికల్, పెయింట్ అండ్ శానిటరీ షాపులో  గత నెల 21న చోరీ జరిగింది. గడ్డపారతో షట్టర్​ను పైకి లేపి లోపలున్న పెయింట్​డబ్బాలు, ఇతర వస్తువులు కలిపి రూ.1.50 లక్షల విలువైన సామగ్రి ఎత్తుకువెళ్లారు.

దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున కూడా మళ్లీ అదే షాపులో దొంగలు పడి రూ.4.50 లక్షల విలువైన సామగ్రి అపహరించారు. ఈ రెండు చోరీల సీసీ టీవీ ఫుటేజీ ఉన్నా నిందితుడిని ఇప్పటివరకు గుర్తించలేదని యజమాని ప్రవీణ్ వాపోయాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.