ఎంజాయ్​ కోసం బావ బావమరిది చోరీలు

ఎంజాయ్​ కోసం బావ బావమరిది చోరీలు

పదిన్నర తులాల గోల్డ్​, 36 తులాల వెండి స్వాధీనం

మేడిపల్లి, వెలుగు :ఎంజాయ్ ​చేసేందుకు చోరీలు చేస్తున్న బావ బావమరిదిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద పదిన్నర తులాల బంగారం, 39 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మల్లాపూర్​లో ఉండే జంగలం చందన్ అలియాస్ రమేష్ ( 36 ), సిరిగిరి శంకరయ్య అలియాస్ శంకర్ ( 26 ) బావ బావమరుదులు.  గతంలో చందన్ చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం డ్రైవర్​గా పని చేస్తున్నాడు. శాలరీ సరిపోకపోవడంతో ఎంజాయ్​ చేసేందుకు ప్లాన్​వేశాడు. తన బావమరిది శంకర్‌తో కలిసి తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తున్నారు.  మేడిపల్లి హనుమాన్ కమాన్ వద్ద పోలీసులు చెకింగ్​చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసులు ఫైల్​ చేశారు. మేడిపల్లి పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

ఇద్దరు దొంగల అరెస్ట్

దుండిగల్ :  బైక్​దొంగలను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలానగర్ జోన్ ఏసీపీ రామలింగరాజు సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. సూరారం కాలనీలో ఉండే శంకర్ యాదవ్ (29), రామయ్యగారి మహేష్ గౌడ్ (30)లు చెడు వ్యసనాలకు బానిసలై  బైక్​లు, ఆటోలు చోరీ చేసి అమ్ముతున్నారు. దుండిగల్, బాచుపల్లి, సూరారం తదితర ఏరియాల్లోని హోటల్స్, థియేటర్స్​, అపార్ట్​మెంట్లలో బైక్​లను ఎత్తుకెళ్లారు. సోమవారం బహదూర్ పల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించగా ఎస్ఐ వెంకటరెడ్డి  అదుపులోకి తీసుకుని విచారించారు. 4 బైక్​లు, ఆటోను చోరీ చేసినట్లు అంగీకరించారు.  నిందితుల వద్ద బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసులో చొరవ చూపిన పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.