కాంగ్రెస్ పార్టీ మునిగిపొతున్న పడవ అన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ హుజూర్ నగర్ TRS పార్టీ ప్రచార ఇన్ చార్జీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన…అలాంటి పార్టీకి ప్రజలు ఒటేయరన్నారు. ప్రజల నుంచి TRS పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందన్నారు. పార్టీ కచ్చితంగా వంద శాతం మెజార్టీతో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విపక్షాలు…ఇప్పుడు ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్న తీరు వాటి అనైక్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని… ప్రభుత్వంలో లేనివారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని స్థానిక ప్రజలు కూడా గుర్తిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ లో ఘోర పరాజయం తప్పదని, పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీలకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు ఉండకపోవచ్చని కేటీఆర్ తెలిపారు.

