సీఎం కాన్వాయ్ కోసం ప్రజల పనులకు అడ్డుకోవద్దు...గంటల తరబడి వాహనాలు నిలిపివేయొద్దు: డీజీపీ సీవీ ఆనంద్

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల పనులకు అడ్డుకోవద్దు...గంటల తరబడి వాహనాలు నిలిపివేయొద్దు: డీజీపీ సీవీ ఆనంద్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల సమయంలో ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టారు డీజీపీ సీవీ ఆనంద్. ఈమేరకు బుధవారం ( మే 6 ) రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం పర్యటనల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీవీ ఆనంద్. గంటల తరబడి వాహనాలు నిలిపివేయొద్దని స్పష్టం చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల పనులు అడ్డుకోవద్దని అన్నారు.

ఎదురుగా వచ్చే వాహనాలను ఆపొద్దని..నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకున్తమని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఎయిర్‌పోర్టు దగ్గర ట్రాఫిక్ జామ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు సీవీ ఆనంద్. ఈ సమావేశం ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ట్రాఫిక్ సూచనలు జారీ చేశారు సీవీ ఆనంద్. ట్రాఫిక్ బ్యూరో  త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు.

ALSO READ : తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకట నారాయణ

కాన్వాయ్ సమయంలో పూర్తిగా ట్రాఫిక్ ఆపకుండా సింగిల్ లైన్ ప్లాన్ అమలు చేయాలని.. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని అన్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని... వర్షాకాలం లో వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఫీల్డ్‌లో ఉండి వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు సీవీ ఆనంద్.