
మంత్రి వర్గంలో సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే
ముంబై : మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సర్కారు శనివారంతో నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికీ కేబినెట్ విస్తరణ ఎప్పుడనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మంత్రి వర్గంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ఉన్నారు. కొత్త సర్కారు కొలువుదీరగానే ముంబై– అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా పేర్లు మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ టైంలో జైలుపాలైన పొలిటికల్ యాక్టివిస్ట్‌లకు ఉద్దేశించిన పెన్షన్ స్కీమ్‌ను షిండే పునరుద్ధరించారు. గతంలో ఈ స్కీమ్‌ను ఫడ్నవీస్ సర్కారు తీసుకురాగా, తర్వాత వచ్చిన ఉద్ధవ్ సర్కారు రద్దు చేసింది. తర్వాత మెట్రో కార్ షెడ్‌ను ఆరే కాలనీలోనే నిర్మించాలని షిండే సర్కారు నిర్ణయించింది.