H4EAD తో అమెరికన్ల ఉద్యోగాలకు నష్టం లేదు

H4EAD తో అమెరికన్ల ఉద్యోగాలకు నష్టం లేదు

అమెరికాలో హెచ్1బీ వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకిచ్చే స్పౌజ్ వీసా అనుమతులు (హెచ్‌‌‌‌‌‌‌‌4 ఈఏడీ) రద్దు చేయాలని కొంతకాలంగా అమెరికన్‌ స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి. దీనిపై అమెరికా సర్కారు సంస్కరణలు కూడా మొదలుపెట్టింది. కానీ తాజాగా హెచ్‌‌‌‌‌‌‌‌4 ఈఏడీ కార్యక్రమం వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు వచ్చేనష్టం ఏమీ లేదని అమెరికా హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌‌‌‌‌‌‌మెం ట్‌ (డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌ ) వాషింగ్ట న్‌ లోని ఫెడరల్‌ అప్పీల్ స్‌ కోర్టుకు వెల్లడించింది. దాని వల్ల అమెరికాలో జాబ్‌ కాంపిటిషన్‌ ఏమీ పెరగదంది. ఈ మేరకు ఏప్రిల్ 1న కోర్టుకు నివేదిక సమర్పించింది.

ఎలా నష్టమో చెప్పాలిగా….

ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు మొదలుపెట్టినహెచ్‌‌‌‌‌‌‌‌4ఈఏడీ ప్రోగ్రామ్‌ వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరొచ్చేలా ఉందని ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్ఏ’కోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కొంతకాలంగా వాదనలు జరుగుతున్నాయి. తాజాగా డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌ సమర్పించి న నివేదికలో ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ ఏ సభ్యులు ఎక్కువగా టెక్నాలజీ రంగంలో పని చేస్తున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌4 ఈఏడీ వల్ల ఉద్యోగాలపై వెంటనే ఎలా ప్రభావం పడుతుందో వాళ్లు చెప్పలేదు.సేవ్‌ జాబ్స్‌ ఆరోపణలన్నీ ఉహాగానాలే’నని కోర్టుకు చెప్పింది. ఏదేమైనా ఈ ప్రోగ్రామ్‌ ను రద్దు చేయాలనే నివేదికలో కోరింది. మరోవైపు డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌ కింద పని చేసే యునైటెడ్‌ స్టేట్ స్‌ సిటి జన్‌ షి ప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌ సీఐఎస్‌ ) తొలుత హెచ్‌‌‌‌‌‌‌‌4 ఈఏడీని తొలగించాలని ప్రతిపాదించింది. కానీ దాన్ని విరమించుకున్నట్టు తాజాగా వెల్లడించింది. ఏప్రిల్‌ 8న ఇమిగ్రేషన్‌ నివేదిక సమర్పించాల్సి ఉంది.

2015లో ప్రారంభం…

హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేసే వాళ్ల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలోనివసించడానికి వస్తారు. ఆ వీసా హోదాతో అమెరికాలో పనిచేయటానికి 2015కు ముందు అనుమతి ఉండేది కాదు. కానీ బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు 2015లో హెచ్1బీ వీసాదారుల భార్యలకూ అమెరికాలో చట్టబద్ధంగా నిచేయటానికి అనుమతులు (ఎంప్లా య్‌ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ) ఇవ్వడాన్ని ప్రారంభించారు. అమెరికాలో‘గ్రీన్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకే ఈఏడీ లభిస్తుంది.ఇది అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు సుమారు 1.05లక్షల మంది హెచ్-4 వీసాదారులు అమెరికాలో పనిచేయటానికి అనుమతి పొందినట్లు అంచనా. వారిలో ఎక్కువ మంది ఇండియన్లే.