
హైదరాబాద్: గోషామహల్లో కేటీఆర్ రోడ్ షో సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేతల మధ్యఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు దిలీప్ ఘనటేపై మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు దాడి చేశారు. పార్టీ సమవేశాలకు సమాచారం ఎందుకు ఇవ్వడంలేదని ఉద్యమకారుడు దిలీప్ ఘనటే ప్రశ్నించగా.. ఆగ్రహంతో మాజీ రామచందర్ రాజు.. దిలీప్ ఘనటేపై దాడి చేసినట్లు తెలుస్తోంది.ఈ దాడిలో దిలీప్ ఘనటే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చికిత్సకోసం ఆయనను హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు పార్టీ కార్యకర్తలు.