
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ బార్ లో మందుబాబుల మధ్య గొడవ జరిగింది. దీంతో బార్ లో ఖాళీ మందు సీసాలను పగులగొట్టారు. గొడవ పడొద్దని ఎంత వారించినా వినిపించుకోలేదు. బార్లో ఉన్న కొంత మంది వారిని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
బార్లో మందుబాబులు వీరంగంపై యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని చూసి ఓ వ్యక్తి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలు మందుబాబుల మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.