ఈఎమ్ఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు వడ్డీపై వడ్డీ మాఫీ

ఈఎమ్ఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు వడ్డీపై వడ్డీ మాఫీ

మారటోరియం పీరియడ్​కు వడ్డీపై వడ్డీ ఉండదు

సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం

రేపు కూడా కొనసాగనున్న విచారణ

ఫలితంగా ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్ల భారం

న్యూఢిల్లీ: చిన్న ఇండస్ట్రీల బారోవర్స్‌‌కు, లోన్లు తీసుకున్న బ్యాంకు కస్టమర్లకు గవర్నమెంట్‌‌ గుడ్‌‌న్యూస్‌‌ చెప్పింది. మారటోరియం కాలంలో లోన్ల రీపేమెంట్‌‌పై వేసిన వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కరోనా అవుట్‌‌బ్రేక్‌‌తో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతోన్న ఇండివిడ్యువల్ బారోవర్స్‌‌కు, చిన్న ఇండస్ట్రీలకు ఈ నిర్ణయం వల్ల ఎంతో ఊరట దొరుకుతుంది. ఆరు నెలల కాలానికి రూ.రెండు కోట్లలోపు లోన్లు తీసుకున్న వారికే వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని స్పష్టం చేసింది.  వడ్డీ మాఫీ విషయమై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా కేంద్రం ఈ మేరకు తన అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘ఇలాంటి ఆపద సమయంలో వడ్డీపై వడ్డీని రద్దు చేయడమే మా దగ్గరున్న ఏకైక పరిష్కారం. వడ్డీని మాఫీ చేసి ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇందుకోసం కేంద్రం పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి. ఎడ్యుకేషన్, హౌసింగ్, క్రెడిట్ కార్డు బకాయిలు వంటి లోన్లు తీసుకున్న వారికి కాంపౌండ్ ఇంటరస్ట్‌‌ను రద్దు చేస్తాం’’ అని అఫిడవిట్‌‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మాజీ కాగ్‌ జనరల్ రాజీవ్ మెహ్రీషి నేతృత్వంలోని ఎక్స్‌‌పర్ట్ ప్యానల్‌‌ ప్రతిపాదనల మేరకు వడ్డీ మాఫీ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది.

మార్చి నుంచి మారటోరియం..

కరోనా లాక్‌‌డౌన్‌‌తో లోన్లు రీపేమెంట్ చేయడానికి ఇబ్బందులు పడుతోన్న వారి కోసం ఆర్‌‌బీఐ మార్చిలో మారటోరియాన్ని తీసుకొచ్చింది. తొలుత మే వరకు మారటోరియం గడువు ఇచ్చిన ఆర్‌‌‌‌బీఐ.. ఆ తర్వాత లాక్‌‌డౌన్ పొడిగించడంతో మారటోరియం కాలాన్ని కూడా ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. మారటోరియం కాలానికి కూడా బ్యాంక్‌‌లు వడ్డీని విధించాయి. క్రెడిట్‌‌కార్డుల బకాయిలపై కూడా అత్యధిక మొత్తాల్లో వడ్డీ ఛార్జ్ చేశాయి. ఇలా వడ్డీని విధించడం అన్యాయమని, ప్రజలు ఇప్పటికే మస్తు ఇబ్బందులు పడుతున్నారని వడ్డీని కూడా మాఫీ చేయాలని సుప్రీంకోర్టుకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వడ్డీ మీద వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మారటోరియం కాలంలో వాయిదా వేసుకున్న ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడం రూల్స్‌‌కు విరుద్ధమని అంతకుముందు కేంద్రం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం లోన్లు రీపేమెంట్ చేసే వారి విషయంలో ఇది చాలా అన్యాయమని పేర్కొంది.  కేంద్ర ప్రభుత్వమే దీనికి ఒక మార్గం కనుక్కోవాలని..  ఆర్‌‌‌‌బీఐ వెనుకాల దాక్కోవద్దని స్పష్టం చేసింది.  లోన్‌‌ కస్టమర్లకు సాయం చేసేందుకు ఒక  ప్లాన్‌‌తో ముందుకు రావాలని కేంద్రాన్ని సుప్రీం  ఆదేశించింది.  దీనిపై స్పందించేందుకు తమకు  మరింత సమయం కావాలని కేంద్రం కోరింది. దీంతో వడ్డీ మాఫీపై జరుపుతున్న విచారణను ఈ నెల 5 వరకు వాయిదా వేసింది. దీనిలో భాగంగానే కేంద్రం తన అఫిడవిట్‌‌ను సమర్పించింది.   దీనిపై సోమవారం మరోసారి విచారణ జరుపనుంది.  వడ్డీలను మాఫీ చేస్తే..  రూ.6 లక్షల కోట్ల భారం పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

వడ్డీ మాఫీపై కేంద్రం ప్రపోజల్స్‌‌

అర్హత: రూ.2 కోట్ల వరకు లోన్ తీసుకున్న వారికి

మారటోరియం పీరియడ్‌‌: మార్చి నుంచి ఆగస్ట్ వరకు

వడ్డీ మాఫీ కిందకు వచ్చే కేటగిరీలు: ఎంఎస్‌‌ఎంఈ లోన్లు, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్స్, ప్రొఫెషనల్ లోన్స్, కన్సంప్షన్‌‌ లోన్స్

బకాయిలు క్లియర్ చేసిన వారికి కూడా వడ్డీపై వడ్డీని రద్దు చేస్తారు. వడ్డీ మాఫీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

For More News..

మాస్కులు లేవు​.. దూరం లేదు.. జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ చేపట్టాలి: గవర్నర్ తమిళిసై

రాత్రి దాకా పని చేయించుకొని.. పొద్దుగాల పనిలోంచి తీసేసిన్రు

పోలీస్​ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్​బుక్‌లు