ICC ర్యాంకింగ్స్ : సత్తాచాటిన కుల్దీప్

ICC ర్యాంకింగ్స్ : సత్తాచాటిన కుల్దీప్

దుబాయ్: భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ర్యాంకింగ్ లో దూసుకుపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌ లో అతడు రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌ లో భారత్ రెండు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. టీమ్ ర్యాంకింగ్స్‌ లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

టీ20 క్రికెట్లో పాకిస్థాన్ టీమ్ టాప్ ప్లేస్ లో ఉంది.  న్యూజిలాండ్‌ తో ఆదివారం జిరిగిన మూడో టీ20లో భారత్ 4 రన్స్ తేడాతో ఓడిపోవడంతో కివీస్ 2-1తో సిరీస్‌ ను కైవసం చేసుకుంది. ఆఖరి టీ20లో కుల్దీప్ 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సిరీస్‌ లో ఆడిన ఏకైక మ్యాచ్‌ లో విధ్వంసకర ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, మున్రోను ..ఔట్ చేశాడు కుల్దీప్ యాదవ్.

కుల్దీప్ కన్నా ముందు అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. టాప్-10లో భారత్‌ కు చెందిన ఏ ఒక్క బౌలర్‌ కు చోటు దక్కలేదు. మరో భారత యువ స్పిన్నర్ చాహల్ ఆరు స్థానాలు పడిపోయి.. 17వ ర్యాంకులో నిలిచాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 18వ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బ్యాట్స్‌ మెన్ ర్యాంకింగ్స్‌ లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు.. KL రాహుల్ పదిలో నిలిచారు.