
మంగళగిరి: కరోనా వైరస్ బారిన పడకుండా తన సిబ్బందికి తగు జాగ్రత్తలు వివరించారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. కోవిడ్-19 నేపథ్యంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ, ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకుడైన చంద్రబాబు కూడా.. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ ఆఫీస్ కి రావొద్దని పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీలోని పార్టీ ఆఫీస్ కి వచ్చిన చంద్రబాబుతో సహ ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు అక్కడి సిబ్బంది. స్క్రీనింగ్ చేశాకే ఇతర నేతలను, కార్యకర్తలను ఆఫీస్ లోకి అనుమతిస్తోంది సిబ్బంది. 100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని కార్యాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించారు.