ప్రతీ స్మార్ట్ ఫోన్ లో ఫీచర్స్ ఉంటాయి. అన్నింటినీ వాడటం చాలామందికి తెలియదు. కొన్ని యాప్స్ వాడటం, కాలింగ్ , మెసేజ్ లకు మాత్రమే ఫోన్స్ వాడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువ మందికి తెలియని కొన్ని ఫీచర్స్ ఇవి
- ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఒక మినీ గేమ్ (ఈస్టర్ ఎగ్స్) ఉంటుంది. ఇది రెగ్యులర్ యాప్స్‌లో కనిపించదు. ఇది సీక్రెట్ గేమ్. దీన్ని ఆడాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘అబౌట్ ఫోన్’ సెక్షన్‌లో కింద బేస్‌బ్యాండ్ వెర్షన్ అని ఉంటుంది. దానికి సంబంధించి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను కీబోర్డ్‌లో ఎంటర్‌చేస్తే, మినీ గేమ్ కనిపిస్తుంది.
- సెట్టింగ్స్‌లోని ‘అబౌట్‌ఫోన్’లోనే ‘ఆండ్రాయిడ్ వెర్షన్’ కనిపిస్తుంది. దీనిపై కొన్నిసార్లు వరుసగా ట్యాప్ చేస్తే, ఒక కలర్‌ఫుల్ డిస్‌ప్లే కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తూ, ఆ ఫీచర్ ఎంజాయ్ చేయొచ్చు.
- ఐఫోన్‌లో కొన్నిసార్లు సిగ్నల్ ప్రాబ్లమ్ రావొచ్చు. ఈ సమస్య ఎక్కువగా ఉంటే సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయొచ్చు. అయితే అప్పటికప్పుడు స్ట్రాంగ్ సిగ్నల్ రావాలంటే ఐఫోన్‌లో *3370# అని టైప్ చేయాలి. అప్పుడు సిగ్నల్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే దీనివల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఒకవేళ ఈ ఫీచర్ డిసేబుల్ చేసుకోవాలంటే మళ్లీ అదే కోడ్ ఎంటర్ చేయాలి.
- ఆండ్రాయిడ్ ఫోన్‌పై వాల్యూమ్ బటన్, లాక్ బటన్ ఉపయోగించి ఎక్కువమంది స్క్రీన్‌షాట్స్ తీసుకుంటారు. కొన్ని ఫోన్స్‌లో త్రీ ఫింగర్స్‌తో స్క్రీన్‌పై కిందికి స్వైప్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అయితే ఇలా కాకుండా అరచేతిని స్క్రీన్‌పై స్వైప్ చేయడం ద్వారా బటన్స్ వాడకుండా స్క్రీన్‌షాట్స్ తీసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘మై డివైజ్’, ‘మోషన్ అండ్ గెశ్చర్స్’పై ట్యాప్ చేసి, ‘పామ్ మోషన్’ను ఎనేబుల్ చేసుకోవాలి.
- పిల్లలు చదువుకోకుండా ఎక్కువసేపు గేమ్స్ ఆడుతూ, మొబైల్ చూస్తుంటే ఆటోమేటిక్‌గా ఫోన్ పవర్ ఆఫ్ అయ్యే ఈ ఫీచర్ ట్రై చేయాలి. ‘షెడ్యూల్డ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్’ అనే ఫీచర్ కొన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘సిస్టమ్’ సెక్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత టైం సెలక్ట్ చేసుకుంటే, ఆ టైం అవ్వగానే ఫోన్ పవర్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల ఫోన్ పవర్ ఆఫ్ అయ్యిందని పిల్లలు ఫోన్ పక్కనపెట్టేస్తారు. పవర్ ఆన్, ఆఫ్.. రెండింటికీ షెడ్యూల్ చేసుకోవచ్చు.
- ఐపాడ్‌లో పెద్ద సైజ్‌లో ఉండే కీబోర్డ్ సగం స్క్రీన్ వరకు ఉంటుంది. దీనివల్ల స్క్రీన్ కింద ఉన్న ఇమేజెస్, టెక్స్ట్‌కనిపించవు. ఇలా కాకూడదనుకుంటే స్క్రీన్‌పై కీబోర్డ్‌ను స్ప్లిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫీల్డ్‌పై ట్యాప్ చేసి, రైట్ లోయర్ కార్నర్‌లో కనిపించే ఐకాన్‌ను హోల్డ్ చేయాలి. తర్వాత స్లైడ్ అప్ చేసి, ట్యాప్ చేయాలి. వెంటనే కీబోర్డ్ రెండుగా విడిపోతుంది.
