వరల్డ్ కప్ 2019 హీరోలు వీళ్లే

వరల్డ్ కప్ 2019 హీరోలు వీళ్లే

ఇంగ్లండ్ లో వరల్డ్ కప్ 2019 క్రికెట్ సమరం ముగిసింది. న్యూజీలాండ్ తో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మెగా ఫైనల్ లో ఇంగ్లండ్ విజేత అయ్యింది. హోమ్ కంట్రీలో సెలబ్రేషన్స్  మిన్నంటుతున్నాయి. ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ను బెన్ స్టోక్స్ గెల్చుకున్నాడు.

మరోవైపు ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు ఎవరో ఐసీసీ ప్రకటించింది.

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ – కేన్ విలియంసన్

578 రన్స్. వరల్డ్ కప్ లో ఓ కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ రన్స్ ఇవి. ఈ ఘనత కివీస్ కెప్టెన్, వరల్డ్ కప్ రన్నరప్ జట్టు స్కిప్పర్ కేన్ విలియంసన్ దక్కించుకున్నాడు. టోర్నీలో అద్భుతంగా రాణించి.. జట్టును ముందుండి నడిపించాడు విలియంసన్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు కేన్.

బెస్ట్ బ్యాట్స్ మన్ – రోహిత్ శర్మ

భారత స్టార్ ప్లేయర్, ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2019లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు(3 హ్యాట్రిక్ సెంచరీలు) చేసిన ప్లేయర్ గా ఇప్పటికే రికార్డులకెక్కాడు రోహిత్ శర్మ. మొత్తం 648 రన్స్ తో రోహిత్ శర్మ పరుగుల వీరుల లిస్టులో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. ఒక్క పరుగు తేడాతో డేవిడ్ వార్నర్ (647 రన్స్) సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. బంగ్లా ఆల్  రౌండర్ షకీబల్ హసన్ 606 రన్స్, కివీ కెప్టెన్ కేన్ విలియంసన్ 578 రన్స్, ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ 556 రన్స్ తో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు.

బెస్ట్ బౌలర్ – స్టార్క్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ బౌలర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు స్టార్క్. న్యూజీలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ 21 వికెట్లు, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 20 వికెట్లు, బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ 20 వికెట్లు, ఇండియా సీమర్ జస్ ప్రీత్ బుమ్రా 18 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు.