మాంజా నుంచి రక్షణగా బైక్లకు గార్డులు.. ఉచితంగా అమర్చుతున్న తిరంగా యూత్

మాంజా నుంచి రక్షణగా బైక్లకు గార్డులు.. ఉచితంగా అమర్చుతున్న తిరంగా యూత్

పద్మారావునగర్, వెలుగు: చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సికింద్రాబాద్ అడ్డగుట్ట తిరంగా యూత్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టూవీలర్లకు మాంజా గార్డులను ఉచితంగా అమర్చుతోంది. బైక్​ముందు భాగంలో ఇనుప వైర్ ను యూ ఆకారంలో బిగిస్తున్నారు. 

ఒక్కో వైర్​కు రూ.65 ఖర్చవుతుండగా.. ఇప్పటివరకు 1,000కి పైగా వాహనాలకు ఈ గార్డులను అమర్చినట్లు, సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యుడు నాగరాజు తెలిపారు. యూత్​సభ్యులను తుకారం గేట్ ఎస్సై శ్రీనివాస్​గౌడ్​వారిని అభినందించారు.