
శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో రామానుజ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేక పూజల్లో భాగంగా సోమవారం 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ.. 108 మంది పెరుమాళ్లకు ఒకే వేదికపై తిరుమంజన సేవ చేయడం అరుదు అని చెప్పారు. సమతామూర్తి క్షేత్రంలో ఈ అద్భుతం సాధ్యమైందన్నారు. – వెలుగు, శంషాబాద్