వందేళ్లలో ఇదే పెద్ద సమస్య

వందేళ్లలో ఇదే పెద్ద సమస్య
  • కరోనాతో గడ్డు కాలం.. 
  • కొన్ని నెలలపాటు ప్రజలు ఇబ్బంది పడ్డరు
  • వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
  • రూ.1,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభాలు, శంకుస్థాపనలు

వారణాసి/న్యూఢిల్లీ: ఈ వందేళ్లలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య కరోనానే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని నెలలుగా ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. గురువారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని పర్యటించారు. ఐఐటీ బీహెచ్‌‌‌‌‌‌‌‌యూలో రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో కొన్నింటిని ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌-రుద్రాక్షను ప్రారంభించారు. ‘‘కరోనాను ఎదుర్కోవడంలో యూపీ ప్రభుత్వం బాగా కృషి చేస్తోంది. డజనుకు పైగా పెద్ద దేశాల్లో కంటే ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో జనాభా ఎక్కువ. కానీ సెకండ్ వేవ్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్​ చేసి, వైరస్ వ్యాప్తిని అడ్డుకున్న విధానం మాత్రం అసాధారణమైనది” అని చెప్పారు. ‘‘యూపీలో ప్రస్తుతం రూల్ ఆఫ్ లా కొనసాగుతోంది. గతంలో మాఫియారాజ్, టెర్రరిజం కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో లేని పరిస్థితి. కానీ ఇప్పుడు చట్టంతో నియంత్రిస్తున్నాం. తప్పు చేస్తే చట్టం వదిలిపెట్టదని క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌కు తెలుసు” అని పేర్కొన్నారు. ప్రభుత్వం అవినీతి, నెపోటిజంతో కాదు.. అభివృద్ధితో నడుస్తోందని చెప్పారు. పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. పెట్టుబడులు వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.లక్ష కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మండి వ్యవస్థను మోడర్న్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు, పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్య అని చెప్పారు.

స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు భారీ డిమాండ్
వేగంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్​కు భారీ డిమాండ్ ఉంటుందని మోడీ చెప్పారు. కొత్త తరానికి స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అనేది ఒక జాతీయ అవసరమని.. ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌‌‌‌‌కు ఇదే ఫౌండేషన్ అని తెలిపారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా మోడీ మాట్లాడారు. ‘‘సంపాదన వస్తోందని నేర్చుకోవడం ఆపకూడదు. ప్రస్తుత ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఎదుగుతారు. ఇది ప్రజలకే కాదు.. దేశాలకూ వర్తిస్తుంది’’ అని చెప్పారు. స్మార్ట్, స్కిల్డ్ మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచానికి ఇండియా అందిస్తోందని తెలిపారు. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1.25 కోట్ల మంది ట్రైనింగ్ తీసుకున్నారని పేర్కొన్నారు.