కులగణన చరిత్రాత్మక నిర్ణయం : భట్టి విక్రమార్క

కులగణన చరిత్రాత్మక నిర్ణయం : భట్టి విక్రమార్క

అసెంబ్లీలో కులగణన తీర్మానం చరిత్రాత్మకమని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.  దేశంలో ఒక స్పష్టమైన జనగణన జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని తెలంగాణ నుంచే కులగణన చేపడతామని అనేక సభల్లో ప్రసంగించామని చెప్పినట్టుగానే బిల్లును ప్రవేశపెట్టామని అన్నారు.

 రాష్ట్రంలో ఉన్న  ప్రతి ఒక్కరిని సర్వే చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులను పొందుపరుస్తామని తెలిపారు. జనాబా దామాషా ప్రకారం సర్వే చేస్తామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలన పదేండ్లలో కులగణన సర్వే చేయలేదని భట్టి విక్రమార్క తెలిపారు.