బాస్ అంటే ఇలా ఉండాలి.. పండగ అని అందర్నీ ఐలాండ్ తీసుకెళ్లాడు

బాస్ అంటే ఇలా ఉండాలి.. పండగ అని అందర్నీ ఐలాండ్ తీసుకెళ్లాడు

తమ బాస్ ను ఇష్టపడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. బాస్ గురించి ఎప్పుడూ  గురించి చెడుగా మాట్లాడటం తరచుగా చూసి ఉంటారు. కానీ ఓ యజమాని మాత్రం తన ఇంట్లో పని చేస్తోన్న ముగ్గురు మహిళలకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. 

బాస్ అనగానే రూల్స్, చెప్పినట్టు వినాలి, టైంకి జరగాలి, లేదంటే వారి కోపానికి గురికావల్సిందేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరికొంత మందైతే తమ అవసరాలను, సౌలభ్యాలను అస్సలు పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదించడంలోనే మునిగిపోతారు. అలాంటి వారి దగ్గర పనిచేసే వాళ్లు కూడా కేవలం డబ్బు కోసమే పని చేస్తారు. ఆ తర్వాత ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తామంటే అక్కడికి వెళ్లిపోతారు. ఇక ఇండ్లల్లో పనిచేసే వారి పరిస్థితి కొన్ని సార్లు అత్యంత దారుణంగా ఉంటుంది. కానీ ఓ ఇంటి యజమాని మాత్రం తన ఇంట్లో పనిచేస్తోన్న ముగ్గురు మహిళలకు ఈద్ సందర్భంగా మంచి బహుమతి ఇచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యజమానిని అందరూ ది బెస్ట్ బాస్ అని పిలవడం ప్రారంభిస్తున్నారు.

హెలికాప్టర్ లో టిక్కెట్లు కూడా..

ఫరా అనే యజమాని తన ఇంట్లో పనిచేసే ముగ్గురు మహిళలను ఈద్ పండగ సందర్భంగా విదేశీ సెలవులకు పంపింది. విలాసవంతమైన ఈ సెలవులను వారు ఓ ద్వీపంలో స్పెండ్ చేసేలా ప్లాన్ చేసింది. అంతే కాదు వారి కోసం హెలికాప్టర్ లో టిక్కెట్లు కూడా బుక్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆ ముగ్గురిలో ఒకరు తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి ఇప్పటి వరకు దాదాపు 17 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఫరా తమ ముగ్గురినీ హెలికాప్టర్‌లో ఓ ద్వీపానికి సెలవుల కోసం పంపారని, ఓ బెస్ట్ రిసార్ట్‌లో వాళ్ల కోసం ఓ ప్రైవేట్ సూట్ కూడా బుక్ చేశారని చెప్పారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫరాకు బెస్ట్ బాస్ అనే బిరుదు ఇస్తున్నారు. దాంతో పాటు అందరికీ ఇలాంటి బాస్ ఉంటే ఎంత బాగుండోనని ఆకాంక్షిస్తున్నారు.